మునుగోడు, మే 23 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సన్న, చిన్న కారు రైతులు పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయభాస్కర్ అన్నారు. ఇందుకు సబంధించిన వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. మండలంలో కొత్తగా పండ్ల తోటలు సాగు చేసే రైతులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మూడు సంవత్సరాల పాటు నిర్మాణ ఖర్చులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వరి సాగు తగ్గించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, సన్న, చిన్న కారు రైతులకు రాయితీ అవకాశం కల్పిస్తుందన్నారు. నాటిన తర్వాత మూడేళ్ల పాటు నిర్వాణ ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉద్వాన పంటలైన మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోటా, మునుగు, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల సాగు చేపట్టాలని సూచించారు. పండ్ల తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలని, జాబ్ కార్డు కలిగి ఉన్న సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.