వంద శాతం సర్ అమలయ్యేలా చూడాలి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒకరూ బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలు నింపి తిరిగి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఆత్మకూరు(ఎం), గుం డాల, మోటకొండూర్ మండలాలకు చెందిన బీఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ఓటు కోల్పోకుండా బీఎల్ఏలు కృషి చేయాలి
- ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
ఆత్మకూరు(ఎం), జులై 16 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒకరూ బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలు నింపి తిరిగి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఆత్మకూరు(ఎం), గుం డాల, మోటకొండూర్ మండలాలకు చెందిన బీఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీ తామహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సర్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు.
అర్హులైన వారు ఓటును కోల్పోకుండా బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలు నింపి, బీఎల్వోలకు అందించేలా చూడాలన్నారు. రెండు చోట్ల ఓటు నమోదైతే, ఎన్నికల అధికారులు చట్టపరమైన చర్య లు తీసుకునే అవకాశం ఉందని, ఒకే చోట ఓటరుగా నమో దు కావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఆత్మకూరు (ఎం) సర్పంచ్ బీసు ధనలక్ష్మీచందర్ గౌడ్, బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షుడు ఎండీ ఖలీల్, జిల్లా నాయకులు కోరె భిక్షపతి, మూడు మండలాల బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BLO
- central government
- SAR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

