– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
చందంపేట, ఆగస్టు 13 : చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో అంకాలమ్మ జాతరను బుధవారం వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, రాములు గౌడ్, శంకర్, సత్యనారాయణ, వెంకటయ్య పాల్గొన్నారు.