దేవరకొండ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేవరకొండ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో ఎంపీపీలు వంగాల ప్రతాప్‌రెడ్డి, మాధవరం సునీతా జనార్దన్‌రావు, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, బాలూనాయక్, వైస్ ఎంపీపీలు ముత్యాలమ్మారాములు, చింతపల్లి సుభాశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు బాలయ్య, బాలూనాయక్, నాగు, వల్లపురెడ్డి, వైస్ చైర్మన్ రాహత్ అలీ, రైతుబంధు మండలాధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, నాయకులు పున్న వెంకటేశ్వర్లు, హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, కంకణాల వెంకట్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, సుమతీరెడ్డి, అశోక్, నర్సింహారావు, వ్యడ్త్యా దేవేందర్‌నాయక్, వేముల రాజు, ముత్యాల సర్వయ్య, కుంభం శ్రీనివాస్‌గౌడ్, రమావత్ దస్రూనాయక్, గుండెబోయిన లింగంయాదవ్, రావుల సత్యనారాయణ, శంకర్‌నాయక్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, అనంతగిరి, మున్నయ్యయాదవ్, శ్రీశైలం, శివ, తిరుపతయ్య, బొడ్డుపల్లి కృష్ణ, అంజిరెడ్డి, పరమేశ్‌యాదవ్, శ్రీనివాస్, ఎంపీటీసీలు వెంకటయ్య, గిరమోని శ్రీను, గుర్రం రాములు, కాశన్న పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసన
దేవరకొండ మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆంజనేయులు, అశోక్, ఉమామహేశ్, జగదీశ్వర్ పాల్గొన్నారు.
సాగర్ నియోజకవర్గంలో..
హాలియా : నియోజకవర్గంలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, నల్లగొండ సుధాకర్, నల్లబోతు వెంకటయ్య, చాపల సైదులు, ఎన్నమల్ల సత్యం, పోశం శ్రీనివాస్‌గౌడ్, కట్టెబోయిన అనిల్‌కుమార్, దోరెపల్లి వెంకటయ్య, సురభి రాంబాబు, వడ్డె సతీశ్‌రెడ్డి, కాట్నం నాగరాజు, కూరాకుల రవి, దుండిగల్ల శ్రీను, మధుబాబు, బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, నర్సింహ, అబ్దుల్ పాల్గొన్నారు. నిడమనూరులో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవియాదవ్, సర్పంచులు బొజ్జ పరిమల, కేశ శంకర్, నాయకులు నల్లబోతుల వెంకటేశ్వర్లు, కళావతి, సునీత, కేశబోయిన జానయ్య, శ్రీలత, చిత్రం జీవన్‌రావు, రమణారెడ్డి, సింగం రామలింగయ్య, వెంకట్మ్రణ, ఈశ్వర్ ప్రసాద్, పెద్దవూరలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి , టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, సర్పంచ్ నడ్డి లింగయ్య, ఉప సర్పంచ్ మిట్టపల్లి ప్రదీప్‌రెడ్డి, నాయకులు షేక్ అబ్బాస్, హైమద్ అలీ, చెన్ను వెంకట్‌రెడ్డి, మెండె సైదులు యాదవ్, పెండ్యాల వెంకటేశ్వర్రావు, నడ్డి లక్ష్మయ్య, గుర్రపోడులో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచి కంటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, నాయకులు పృథ్వీరాజ్‌గౌడ్, నాయకులు ధనుంజయ్, తేలుకుంట్ల కుర్మారెడ్డి, సర్పంచులు జక్కల భాస్కర్, చాడ చక్రవర్తి, మర్రి అనితాసైదులు, కేసాని యాదగిరిరెడ్డి, రాములు, యాదయ్య, త్రిపురారంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామ్‌చందర్‌నాయక్ ద్రనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి, కామెర్ల జానయ్య, ధన్‌సింగ్‌నాయక్, రామచంద్రయ్య, అనంతరెడ్డి, భరత్‌రెడ్డి, దస్తగిరి, ధనావత్ రవి, మడుపు వెంకటేశ్వర్లు, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, వెంకటాచారి, సర్పంచులు సుశీల్నాయక్, శ్రవణ్, హనుమంతునాయక్ పాల్గొన్నారు. తిరుమలగిరి (సాగర్)లో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, సర్పంచ్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు కోటిరెడ్డి, పిట్టల కృష్ణ, రాము, సోషల్ మీడియా అధ్యక్షుడు గోపి, బుచ్చిబాబు పాల్గొన్నారు.