నీలగిరి, మార్చి 23: అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు రూ.18వేల వేతనం పెం చాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి హెచ్చరించా రు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేం ద్రాలకు మార్చి నుంచి ఒంటిపూట బడులు నిర్వహణతోపాటు మేలో టీచర్లు, హెల్పర్లకు ఇద్దరికీ ఒకేసారి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీల టీచర్లు, హెల్పర్లకు రూ.18 వేల వేతనంతోపాలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, యూనియ న్ జిల్లా అధ్యక్షురాలు పొడిచేటి నాగమణి, జిల్లా కార్యదర్శి బందు పార్వతి, జిల్లా వరింగ్ సెక్రటరీ అవుట రవీందర్, వరింగ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి, అంబటి మణెమ్మ, ఫాతి మ, ఇంద్రగంటి సైదమ్మ, పల్లా సరిత, బొబ్బిలి శ్రీలక్ష్మి, మణిరూప, పరిపూర్ణమ్మ, యాదమ్మ, కళ్యాణి, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
సూర్యాపేట, మార్చి 23: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ ఆధ్వర్యం లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలతోపాటు టీచ ర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంగనవాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పో తోందన్నారు.
అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఐసీడీఎస్యూ సరిపడా నిధులు కేటాయించాలన్నారు. ఎన్ఈపీ 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. అంగన్వాడీలకు ఒంటిపూట బడులు అమలు చేయాలని, మేలో సెలవులు ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను సమీకరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీటీడబ్ల్యువో నరసింహారావుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మామిడి సుందరయ్య, నరసింహారావు, చెరుకు యాకలక్ష్మి, ధనియాకుల శ్రీకాంత్వర్మ, జిల్లా వ్యాప్తంగా వివిధ సెక్టార్లకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.