నీలగిరి, మే 28: తెలంగాణకు సీమాంధ్రుల గ్రహణం వీడటం లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పుష్కర కాలం దాటినా మళ్లీ అంధ్రా అధికారులు పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తూ జిల్లాను గుప్పెట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నా రు. అందులో భాగంగా మహిళా సంక్షేమ శాఖలో ఓ అంధ్రా అధికారి కూడా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా తన స్థానం వదలి జిల్లా కేంద్రానికి వచ్చి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభు త్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆమె అనధికార విధు లు నిర్వహించడంతోపాటు కింది స్థాయి అధికారులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణవేణికి ఆర్జేడీగా పదోన్నతి కల్పించారు. ఆమె అక్కడ విధు లు నిర్వహించాల్సి రావడంతో నల్లగొండ పీడీ స్థానం ఖాళీ అవుతుంది. ఎలాగైన తాను ఆ స్థానంలోకి వచ్చేందుకు ఆమె అడ్డదారిలో, తెలివిగా పావులు కదిపారు. తన విజన్‌ను అమలు చేసి సీనియర్ సీడీపీవోలు ఉన్నా రాష్ట్ర స్థాయిలో తనకున్న పలుకుబడితో తన పేరును జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించుకున్నారు. జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టులుండగా అందులో నలుగురు సీడీపీవోలు సీనియర్లు ఉన్నారు. ఎవరైనా అధికారులు బదిలీ లేదా సెలవుల్లో వెళ్లితే జిల్లా కేంద్రంలోని అధికారికే మొదటి అవకాశం ఇస్తారు. అలా లేనప్పుడే ఇతర ప్రాంతంలోని వారికి ఇస్తారు.
సీనియర్లను కాదని జిల్లా కేంద్రంలో ఉన్న సీడీపీవోను కాదని పక్క ప్రాజక్టులో ఉన్న సీడీపీవోకు విధులు అప్పగించ డం ఏమిటని పలువురు ఫైర్ అవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ ఆమె తన స్థానాన్ని వదిలి జిల్లా కేంద్రానికి వస్తూ ఇక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా రు. అంతేకాకుండా ఇటీవల మహిళ సంక్షేమ శాఖ లో కూడా ఓ అంధ్రా అధికారి తెలంగాణ రాష్ర్టానికి చెందిన తన ప్రాజెక్టును వదిలి జిల్లా కేంద్రం లో విధులు నిర్వర్తిస్తూ ఇక్కడి కింది స్థాయి అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ నోరుపారేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎప్పు డూ హైదరాబాద్‌లోనే ఉంటూ చింతపల్లి, కొండమల్లేపల్లి, మునుగోడు ప్రాజెక్టుల్లో పనిచేస్తూ విధు లు సక్రమంగా నిర్వర్తించకుండా అవార్డులు తీసుకోవడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి.
వారం రోజుల క్రితం జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా స్థాయిలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. అయితే అం గన్వాడీ టీచర్లకు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిం ది. కానీ అధికారులు మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రతిఒక్కరూ పౌష్టికాహారం తీసుకొని రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో ఉన్నప్పటికీ కూడా అంగన్వాడీ టీచర్లు చిరు ధాన్యాలు, ఇతర పౌష్టికాహారం తీసుకొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌కు వచ్చారు. చాలా రోజల తరువాత జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని అక్కడికి కూడా తీసుకురావాలంటూ ఆంధ్రా అధికారి అనధికారికంగా అదేశాలు జారీ చేశారు.
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేవలం నల్లగొండ ప్రాజెక్టునే తీసుకురావాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఇతర ప్రాజెక్టుల సీడీపీవోలు అధికారులు మాత్రం ఒట్టి చేతులతో వచ్చారు. కానీ అందరూ అక్కడే ఉన్నప్పటికీ అంధ్ర అధికారి మాత్రం వా ట్సాప్ గ్రూపుల్లో అంగన్వాడీ టీచర్లను, సూపర్ వైజర్లను కించపరిచేలా పోస్టులు పెట్టారు. నల్లగొం డ ప్రాజెక్టును ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఫొటోలు పెట్టారనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కలెక్టర్ స్టాల్స్‌ను ప్రారంభించిన అనంతరం కార్యక్ర మం ముగిశాక టీచర్లు, సూపర్వైజర్లు అక్కడి నుం చి వెళ్లిపోవడంతో తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ నోరు పారేసుకున్నారు.
మరుసటి రోజు రెడ్‌క్రాస్ భవన్లో జరిగిన బాల్య వివాహాల అవగహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నప్పటికీ స్థానిక సీడీవో లేకుండానే కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ ప్రాజెక్టులో జరిగే కార్యక్రమాల్లో నల్లగొండ సీడీపీవోకు సమాచారం ఇవ్వకుండా పక్క ప్రాజెక్టు సీడీపీవో నిర్వహించడం ఎంతవర కు సమంజసమో ఆమెకే తెలియాలి. టీఎన్జీవోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎవరు పాల్గొనక పోయినా సదరు సీడీపీవో మాత్రం పాల్గొన్నారు.