కాంగ్రెన్ నేతల భూకబ్జాపై విచారణ చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతూ అప్పటికే కబ్జాలో ఉన్న నిరుపేదలను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు.
- మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నీలగిరి, జూలై 17: కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతూ అప్పటికే కబ్జాలో ఉన్న నిరుపేదలను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. నల్గొండ మండలం చెన్నుగూడెంలో భూ సమస్యను పరిషరించాలని కోరుతూ బాధితులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూమిపై కబ్జాలో ఉన్న వారిని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్ మారగోని గణేశ్, నల్లగొండ, తిప్పర్తి మండలాల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి పల్లిరెడ్డి రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గుండెబోయిన జంగయ్య, రైతులు మరి రాములు, మర్రి సైదులు, మర్రి లింగయ్య, మర్రి ఐలయ్య, మర్రి పెద్దులమ్మ, మర్రి హేమలత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

