మునుగోడు, జూన్ 11 : మునుగోడు మండల కేంద్రంలోని 2, 3 అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీడీపీఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్వాడీ బడిలో చేరాలని వారికి స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడేండ్లకు పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శిరీషా, అంగన్వాడీ టీచర్లు పి.పద్మ, సీహెచ్ లక్షీ, ఎం.వినోద, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.