చిట్యాల, మే 11 : మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన శిరగోని యాదయ్య కుమార్తె శిరీష, మట్టిపల్లి రమేశ్ కుమార్తె యమునలకు పెండ్లి కానుకగా గురువారం గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి రూ.25 వేల చొప్పున ఇరు కుటుంబాల సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కాకూడదని గుత్తా వెంటక్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు.