నల్లగొండ రూరల్, జూన్ 25 : తైక్వాండో ఛాంపియన్షిప్ జాతీయ పోటీలకు నల్లగొండ పట్టణానికి చెందిన క్రీడాకారుడు అంబటి ప్రణీత్ రిఫరీగా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 8వ ఓపెన్ జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ తనకు ఆవకాశాన్ని కల్పించిన తెలంగాణ తైక్వాండో రాష్ట్ర జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ ఎ.ప్రవీణ్ కుమార్, అసోసియేషన్ ఆఫ్ నల్లగొండ డిస్ట్రిక్ సెక్రటరీ యూనస్ కమాల్కు కృతజ్ఞతలు తెలిపారు.