యాదాద్రి భువనగిరి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు తామెందుకు పూర్తి చేయాలనుకుంటుందో.. లేదా..పనులు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యమో తెలియ దు గానీ జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అందులో ప్రధానమైంది తుర్కపల్లి గ్రీన్ ఇం డస్ట్రియల్ పార్కు. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా రెండేండ్ల హస్తం పార్టీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూసేకరణ, పరిహారం పం పిణీ పూర్తయినా.. కనీసం పట్టించుకోవడం లేదు. పార్కు అందుబాటులోకి వస్తే పెద్దఎత్తున పరిశ్రమలు, ఉత్పత్తులు ఊపందుకోవడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. పారిశ్రామికవాడల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయింది. తుర్కపల్లిలోని సర్వే నంబర్ 72లో 93.21ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. భూసేకరణ కోసం ప్రభుత్వం 2021 జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. 61మంది రైతుల నుంచి భూసేకరణ సేకరణ కూడా పూర్తయ్యింది. భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి 17లక్షల పరిహారం చెల్లించింది. మొత్తంగా రూ.16.64 కోట్ల పరిహారం అందజేసింది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఎంతో కృషి చేశారు.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగులకు జాబ్‌లు దొరుకుతాయి. పార్కులో అధికశాతం ఉద్యోగా లు స్థానికులకే దక్కే ఛాన్స్ ఉం టుంది. తుర్కపల్లి మండలంలోపాటు బొమ్మలరామారం, యా దగిరిగుట్ట, జగదేవ్‌పూర్, భువనగిరి మండలాల్లోని వివిధ గ్రా మాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. పార్కు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. గతంలో ఇక్కడ ఎకరం రూ. 10లక్షలు కూడా పలికేది కాదు. ఇప్పుడు ఎకరా, కోటి దాకా విలువ చేస్తున్నది. కాగా బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఇంత పెద్ద ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్ట డం లేదు. అసలు పార్కు ముందుకు కొనసాగుతుందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఏ ఒక్కరూ స్పందించ లేదు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినా, మంత్రులు విచ్చేసినా పార్కు ముచ్చట్నే ఎత్తడం లేదు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది.
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో పెద్ద సంఖ్య లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. నిర్మాణ సామగ్రి, ప్యాకేజింగ్, యంత్రాలు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, బయో ఫెర్టిలైజర్లు, ప్రింటింగ్ తదితర రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఎన్నో ఉత్పత్తులు తయారవుతున్నాయి. అక్కడ తయారయ్యే ఉత్పత్తులు, వస్తువులు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా తుర్కపల్లిలోనూ ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం భావించింది. ఇది అందుబాటులోకి వస్తే దండుమల్కాపురం మాదిరి తుర్కపల్లిలో కూడా పెద్దఎత్తున పరిశ్రమలు తరలిరానున్నాయి. దీంతో ఇక్కడ ఉత్పత్తుల జోరు పెరగనుంది. ఫలితంగా ఎగుమతి, దిగుమతులు ఊపందుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు, రవాణా సదుపాయం మరింత మెరుగుపడుతుంది.
తుర్కపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు మంజూరు కోసం అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎన్నోసార్లు కలిశాను. విజ్ఞప్తులు, వినతులు, విన్నపం మేరకు పార్కు మంజూరైంది. భూసేకరణకు ఇబ్బందులు తలెత్తినా సజాగేలా చర్యలు తీసుకున్నాం. భూసేకరణ పూర్తయింది. నిర్వాసితులకు పరిహారం కూడా పంపిణీ చేశాం. కానీ కాంగ్రెస్ వచ్చాక పైసా పనిచేయ లేదు. కేసీఆర్ తీసుకొచ్చారనే పట్టించుకుంట లేరా..? అందుబాటులోకి వస్తే ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. పార్కు వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.