కట్టంగూర్, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు అన్నారు. శనివారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మండల అభివృద్ధికై సిపిఎం ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు పాదయాత్ర నిర్వహించనట్టు తెలిపారు.
మండలంలో నాలుగు రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. అయిటిపాముల లిఫ్ట్‌ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. సమావేశంలో మండల కమిటీ సభ్యులు చిలుముల రామస్వామి, మురారి మోహన్, గడగోజు రవీంద్ర చారి, కట్ట బక్కయ్య, జాల రమేశ్, ఊట్కూరు సుజాత, శీను, జాల ఆంజనేయులు, చిలుకూరు సైదులు, రవీందర్ లక్ష్మయ్య పాల్గొన్నారు.