‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం’
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.
కోదాడ, ఏప్రిల్ 24 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడపడంతో ప్రయాణికులకు భద్రత కరువైందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మె ఉధృతం అయిందని సమస్యలు పరిష్కరించే దాకా వెనకకు తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం చర్చలు చేయకపోవడంతో మనస్థాపన చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని, మరో ఇద్దరిదీ ఇదే పరిస్థితి అని తక్షణమే సమస్యల పరిష్కారానికి జరుగుతున్న చర్చలను మంత్రులు సఫలం చేయాలన్నారు.
కాగా సమ్మెకు ఏఐటీయూసీ, సిఐటియు, బీఆర్ఎస్ కార్మిక విభాగం, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, ముత్యాలు రాంబాబు, ఎస్కే నయీమ్, రావెళ్ల సీతారామయ్య, రఘు, వేనేపల్లి శ్రీనివాసరావు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్లెక్సీకి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకర గౌడ్ అమర్ హై.. జోహార్ లంటూ నినాదాలు చేస్తూ డిపో ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మిక నాయకులు పుల్లయ్య, అబ్దుల్, ఉప్పలయ్య, రాజశేఖర్, కె.వి రత్నం, ఎస్ఎస్ రావు, అంజలి, జ్యోతి, చుక్కమ్మ, శ్రీదేవి, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

