నల్లగొండ, ఫిబ్రవరి 3 : జిల్లా వ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావుతో కలిసి ములుగు జిల్లా నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా నల్లగొండ నుంచి అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి 15న గ్రామప్రజలు, మహిళా సంఘాలు, యువకులతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్యతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.