ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్
నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
రామగిరి, జూలై 07 : నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ.. శ్రీ చైతన్యతో పాటు జిల్లాలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, డైరీలు, యూనిఫామ్లను విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని మురళీకృష్ణ ఆరోపించారు. వెంటనే ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలుగా పెంచిన ఫీజులను తగ్గించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజులను నియంత్రించకపోతే ప్రైవేటు పాఠశాలలపై దాడులు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు వినయ్, శ్రీకాంత్, శివ, వాసు, నవీన్, మహేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

