కోదాడ, మే 11 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బా కొట్టును తొలగించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని టీ ఎస్ ఏ అధ్యక్షుడు ఎన్.ఎం.శ్రీకాంత్ యాదవ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ప్రధాన రహదారిని ఆనుకుని లక్షల విలువ చేసే మున్సిపల్ స్థలంలో పట్టపగలే కబ్జా చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడే కబ్జా చేశారని ఈ అంశంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలన్నారు. తక్షణమే అధికారులు కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్‌కు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాదాల ఉపేందర్, పొడుగు హుస్సేన్, కుదరవెల్లి బసవయ్య, ప్రేమ్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.