నల్గొండ : అమాయక ప్రజలకు అధిక వడ్డీ ( High interest ) ఆశ చూపి మోసం చేసిన నిందితుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sarath Chandra Pawar) శనివారం ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలోని పీఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ బాలాజీ నాయక్( Balaji Nayak) గత ఆరు సంవత్సరాలుగా అధిక వడ్డీ పేరుతో సుమారు రూ. 50 కోట్లను వసూలు చేశాడని, అసలు, వడ్డీని అడిగితే పారిపోయాడని వివరించారు .
రామవత్ బాలాజీ నాయక్ డిగ్రీ ఫెయిల్ అయి బంధువుల వద్ద రూ. 5 లక్షలు రూ. 2 వడ్డీకి తీసుకుని ఐస్‌క్రీం పార్లర్‌ను మొదుల పెట్టి నష్టపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మరో రెండు లక్షలు రూ. 6 వడ్డీకి తీసుకుని మొదలు పెట్టాడు. చివరకు మరికొందరు రూ.10కు వడ్డీకి తీసుకుని ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు.
దీంతో అతడిపై నమ్మకం కుదరడంతో కొంత మంది ఏజెంట్లను నియమించుకుని అధిక వడ్డీ పేరుతో డబ్బులను వసూలు చేసి స్థిర ఆస్తులను, విలాసవంతమైన కార్లను, విల్లాలను సంపాదించు కున్నాడు. వచ్చిన కోట్ల డబ్బుతో మద్యం దుకాణాల కోసం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. మరోవైపు వడ్డీకి డబ్బుల ఇచ్చిన ప్రజల నుంచి ఒత్తిళ్లు రావడంతో అతడు పారిపోయాడని ఎస్పీ వివరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి పర్చునార్ కార్, స్కార్పియో కారు, మిర్యాలగూడ, హైయత్ నగర్ విలువైన ఆస్తి పత్రాలు , నేరేడుచర్ల, పలుగు తండాలో ఇల్లు, దామరచర్ల, వ్యవసాయ భూమి. బాధితుల రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.