సూర్యాపేట, ఏప్రిల్ 01 : కొత్త జీఓతో ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులను తగ్గించడం సరికాదని పాత జీఓ ప్రకారం అర్హులైన ఆందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు వజ్జ వీరయ్య, గుండా శ్రీనివాస్ గుప్తా, మిక్కిలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాత జీఓ ప్రకారం పట్టణంలో పని చేసే ప్రతి విలేకరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. మండలాల విలేకరులకు యధావిధిగా కార్డులు ఉన్నప్పటికి పట్టణాల్లో కార్డుల సంఖ్యను తగ్గించడం సరికాదన్నారు. పట్టణాల్లో మున్సిపాలిటీ, కలెక్టరేట్, క్రైం తదితర విభాగాలను కవర్ చేసే విలేకరులు ఉంటారు కాబట్టి వారందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం పునరాలోచించి కొత్త జీఓ ద్వారా కాకుండా పాత జీఓ ద్వారా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు వాసా చంద్రశేఖర్, నాయిని శ్రీనివాసరావు, షేక్ జహంగీర్, శ్యాంసుందర్‌రెడ్డి, రాంబాబు, వల్లాస్ ప్రవీణ్, బుక్క రాంబాబు, శేఖర్, గునగంటి సురేష్, చౌగాని నరేందర్, యాకయ్య, పి.సైదిరెడ్డి, దేవరగట్ల సతీష్, సుంకరబోయిన వెంకటయ్య, కందుల నాగరాజు, రవి, పడిసిరి వెంకట్, పిన్నెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.