ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మహమూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని మందులవారి కాలనీలో ఉన్న అతని నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అలాగే నల్లగొండలోని నివాసంలోనూ ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది.