రామగిరి, ఏప్రిల్ 20 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతో యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యువ టీచర్స్’ అంశంపై ఈ నెల 18న చేపట్టిన వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. దీనికి ఎంజీయూతోపాటు వివిధ యూనివర్సిటీల నుంచి పీహెచ్డీ స్కాలర్స్, ఎంఈడీ, బీఈడీ అధ్యాపకులు, డిగ్రీ, పీజీ కళాశాలలలోని కామర్స్, ఎంబీఏ సోషల్ సైన్స్ విభాగాల యువ అధ్యాపకులు 39 మంది హాజరయ్యారు. అత్యంత నిపుణులైన సీనియర్ ప్రొఫెసర్స్ శిక్షణ అందించి స్ఫూర్తి నింపారు. రోజూ ఐదు సెషన్లలో పరిశోధన అంశాలు, అకాడమిక్ రైటింగ్ ఫర్ రీసెర్చ్‌పై ఐసీఎస్ఎస్ఆర్, ఐపీఈ, ఓయూ, పాలమూరు, ఎంజీయూ నుంచి నిపుణులు హాజరై శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పరిశోధనల్లో గుణాత్మక విధానం, రీసెర్చ్ ప్రపోజల్స్ తయారీ, అకాడమిక్ రైటింగ్, పరిశోధన పత్రాల ప్రచురణ, డాటా సేకరణ, ఎనాలాసిస్, పైండింగ్స్, ఇంటప్రిటేషన్స్తోపాటు పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, ప్రాక్టికల్‌గా వివరించారు. శిక్షణలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ బి.సుధాకర్‌రెడ్డి, ఓయూ ప్రొఫెసర్లు ప్రశాంత ఆత్మ, ఏఎస్ చక్రవర్తి, చెన్నప్ప, ఐపీఈ ప్రొఫెసర్ వై.రామకృష్ణ, ఎంజీయూ ప్రొఫెసర్ కొప్పులు అంజిరెడ్డి, పాలమూరు ప్రొఫెసర్ అనురాధ, వర్క్‌షాప్ కన్వీనర్, ఎంజీయూ కామర్స్ హెచ్ఓడీ ఆకుల రవి, కో కన్వీనర్‌గా కె.శ్రీదేవి పాల్గొన్నారు.
నేను బీఈడీ కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తున్నా. బీఈడీ 2023-25 విద్యా సంవత్స రం బ్యాచ్ నా ల్గో సెమిస్టర్ లో రీసెర్చ్ గ్రం థాన్ని విద్యార్థులకు అందించాల్సి ఉంది. ఎంజీయూలో అకాడమిక్ రైటింగ్ ఫర్ రీసెర్చ్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన. నిపుణులైన ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసే విధానం, అకాడమిక్ రైటింగ్, పరిశోధనకు ఉపయోగపడే వెబ్సైట్లో అంశాల సేకరణపై వివరించారు. ముఖ్యంగా ప్రొఫెసర్లు వై.రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, అంజిరెడ్డి చెప్పిన విషయాలు స్ఫూర్తి కలిగించాయి.
నేను గతంలో ఇతర యూనివర్సిటీల్లో నిర్వహించిన శిక్షణకు హాజరయ్యాను. కానీ ఎంజీయూ నిర్వహించిన అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్ శిక్షణలో ఎన్నో కొత్త పరిశోధన విషయాలు నేర్చుకున్నా. ప్రొఫెసర్లు ప్రశాంతి ఆత్మ, రామకృష్ణ, ఏఎస్ చక్రవర్తి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో అర్థమయ్యేలా అనేక విషయాలు వివరించారు. పీహెచ్డీ చేయడానికి అవసరమైన చాలా అంశాలను శిక్షణలో నేర్చుకున్నాను.