– మంత్రి కోమటిరెడ్డికి ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల వినతి
రామగిరి, నవంబర్ 12 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంజీయూ ఏబీబీపీ అధ్యక్షుడు హనుమాన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయలేని పక్షంలో విద్యార్థులపై ఫీజుల భారం పడుతుందని తెలిపారు. నూతన కోర్సులు (లా, ఫార్మసీ, బిఈడి, ఎంఈడి, జర్నలిజం) ప్రవేశ పెట్టాలని కోరారు. అదే విధంగా నిత్యం వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీకి రాకపోకలు జరిపే సందర్భంలో నేషనల్ హైవే ఉన్న కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారని కావునా వర్సిటీ వద్ద స్కై వాక్ ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా యూనివర్సిటీలో నిర్వహించే జాబ్ మేళాలకు మల్టీ నేషనల్ కంపెనీస్ తీసుకొచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. వినతి పత్రం అందచేసిన వారిలో వర్సిటీ ఏబీబీపీ కార్యదర్శి మోహన్, యూనివర్సిటీస్ కో-కన్వీనర్ మౌనేశ్, ఉపాధ్యక్షుడు విజయ్, సూర్య, విద్యార్థి నాయకులు సంపత్, నరసింహ, సుధీర్, సతీశ్, అజయ్, దేవదాస్ పాల్గొన్నారు.