వలిగొండ, జూన్ 28: ఇందిరమ్మ ఇండ్ల ఎం పికలో తనకు జరిగిన అన్యాయంపై ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని వెంకటాపురం గ్రామం లో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డు మత్స్యగిరి పేరు ఇటీవల ప్రకటించి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో లేదు. దీంతో తన పేరు జాబితాలో ఎందుకు లేదంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులను, పం చాయతీ అధికారులను నిలదీసినా ఎవరూ సరై న సమాధానం చెప్పలేదు.
గ్రామంలోని రాజకీయ నాయకుల జోక్యం వల్లే తనకు ఇల్లు రాలేదనే బాధతో శనివారం ఉదయం మత్స్యగిరి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై యుగంధర్ ఘటన ప్రదేశానికి చేరుకొని అధికారులతో మాట్లాడి ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి ఆయనను కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.