మునుగోడు, సెప్టెంబర్ 10 : తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని రజక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప వ్యక్తి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు రెవెల్లి అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి రెవెల్లి సైదులు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, గురిజ రామచంద్రం, తిరుపాటి వెంకటేశ్వర్లు, పగిల్ల శ్రీరాములు, సైదులు, శ్రీను, నవీన్, గణేష్, ఎల్లయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.