తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణంగులాబీ ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
దాంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. పరిసర ప్రాంతాలు గులాబీ వనాన్ని తలపించాయి. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి జనం ఈలలు, చప్పట్లతో మద్దతు పలికారు. నియోజకవర్గాన్ని ఎంతో చేసిన బీసీ బిడ్డ మల్లయ్య భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నప్పుడు చేతులెత్తి మద్దతు తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.