నార్కట్‌పల్లి జూన్ 3: తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న మినీ బస్సు రోడ్డు పక్కన ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యా యి. మరో 14 మందికి స్వల్ప గాయాలయ్యా యి. ఈ ప్రమాదం అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన నాలు గు కుటుంబాల వారు ఎనగందుల నరేశ్, రాజు, బొంగూరి ఉపేందర్, పగిడిపాల రవికుమార్, రమణ తదితరులు 16 సీట్ల మినీ బస్సులో అరుణాచలం వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమం లో నార్కట్‌పల్లి శివారులోని మద్రాస్ కాఫీ ఫిల్టర్ షాపు ఎదురుగా పార్కు చేసిన డీసీఎంను వెనుక నుంచి వచ్చిన మినీ బస్సు ఢీకొట్టింది. అంతకుముందే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలం వద్దకు వెం టనే చేరుకున్నారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో డైవర్‌కు రెండు కాళ్లు విరిగాయి. ద్రోనిక, కార్తికేయ, శ్రేయాన్లు అనే ముగ్గురు చిన్నారులు సీట్లు తొలిగించిన స్థలంలో పడుకున్నారు. వీరి తలభాగాన ఉన్న లగేజ్ మీదపడటంతో ఊపిరి ఆడక ఎనగందుల నరేశ్ కూతురు ద్రోనిక మృతి చెం దింది. మరో ఇద్దరు చిన్నారులు కార్తికేయ, శ్రేయాన్కు తీవ్ర గాయలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందిన చిన్నారి కటుంబ సభ్యులు నూతన్‌కల్ మండలం ఎలకపల్లి గ్రామానికి చెందినవారు. ఇటీవల ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మిగిలిన వారిని చికి త్స నిమిత్తం 108లో కామినేని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.