కోదాడ, జనవరి 13: దేశ వ్యాప్తంగా సమాజాన్ని విచ్ఛిన్నకరం చేసేందుకు కుట్ర పన్నుతున్న విచ్ఛిన్నకర శక్తులను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ కోదాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణుల సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలతో చేకూరిన ప్రగతి దేశవ్యాప్తంగా విస్తరింపచేసేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ న డుం బిగించారని కొనియాడారు. నియోజకవర్గం నుంచి 50 వేల మందికి పైగా తరలి వెళ్లేందుకు శ్రేణులనుసమాయత్తం కావాలని ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ లాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.