నీలగిరి, నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 20: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్ధన్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారంటూ బీసీ విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా పాత పద్ధతిలో 17 శాతం తగ్గించి ఎన్నికలకు పోతే మంత్రులను బయట తిరగనివ్వమన్నారు. నాయకులు మేడబోయిన సాయికుమార్, నాగరాజు గౌడ్, రామన్న, శివ, భాష, చందు, చరణ్, తరుణ్, గణేశ్ రామ్ చరణ్ పాల్గొన్నారు.
మిర్యాలగూడటౌన్, ఫిబ్రవరి 20: రాబోయే ఆర్థిక సం వత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించడంతో పాటు చట్టబద్ధమైన బీసీప్లాన్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వ ర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహాత్మాజ్యోతిబాపూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.‘తాము అధికారంలోకి రాగానే ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీల బడ్జెట్ రూ.20వేల కోట్లు పెంచుతాం. మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్‌ప్లాన్ తీసుకొస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం’ అని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి రెండు సంవతర్సరాలు కావస్తున్నా హామీని అమలు చేయకుండా మోసం చే స్తోందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు ఎర్రబెల్లి దుర్గయ్య, లవన్ కుమార్, వెంకటేశ్, సుదర్శన్, రవి, అశోక్, బాలు, సందీప్, సంతులాల్, ధర్మ య్య, కిషన్, రాజేశ్, మహేశ్, రాంబాబు పాల్గొన్నారు.