బీబీనగర్, జూన్ 22 : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం… భువనగిరి పట్టణానికి చెందిన ఎర్రోజు రాజు (42), మోత్కూరు మండలం తిరుమలగిరికి చెందిన తంగళ్లపల్లి సత్యనారాయ ణ(50) శనివారం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి బైక్ గూడూరు టోల్ ప్లాజా వద్ద ముందుగా వెళుతున్న కారును ఢీకొట్టింది. ఆ ఇద్దరికి తీవ్రగా యాలయ్యాయి. పోలీసులు వీరిని దవాఖానకు తరలిస్తుండగా ఎర్రోజు రాజు మార్గం మధ్యలో మృతి చెందాడు. తం గళ్లపల్లి సత్యనారాయణ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మిర్యాలగూడ: స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడలో జరిగింది. వన్ టౌన్ సీఐ సీహెచ్ మోతీరాం కథనం ప్రకారం… పాలకీడు మండ లం శూన్యంపహాడ్కు చెందిన గంధం అరుణ్(25), రామకృష్ణలు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. వీరిద్దరు ఆదివారం స్కూటీపై మిర్యాలగూడ నుంచి హాలియా వైపు వెళ్తుండగా లోడ్‌తో వెళ్తున్న వడ్ల లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. స్కూటీపై వెనుక కూర్చొన్న అరుణ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రామకృష్ణను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.