శనివారం 06 మార్చి 2021
Nalgonda - Jan 22, 2021 , 01:41:10

2,216 మందికి కరోనా టీకా

2,216 మందికి కరోనా టీకా

  • నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

నీలగిరి, జనవరి21 : కరోనా టీకాను గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, వైద్యారోగ్య సిబ్బందికి వేశారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,383 మందికి వ్యాక్సిన్‌ చేశారు. గురువారం నల్లగొండ జిల్లాలో 2,762 మందికి టీకాలు వేయాలని నిర్ణయించగా 1,158 మంది టీకా తీసుకున్నారు. నల్లగొండ డివిజన్‌లోని 16 కేంద్రాల్లో 432 మంది, మిర్యాలగూడ డివిజన్‌లోని 11 కేంద్రాల్లో 352 మంది, దేవరకొండ డివిజన్‌లోని 12 కేంద్రాల్లో 374 మంది టీకా తీసుకున్నారు. శుక్రవారం అన్ని కేంద్రాలతోపాటు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 

సూర్యాపేట జిల్లాలో 1058 మందికి..

సూర్యాపేట, జనవరి 21 : సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 2,786 మంది కరోనా టీకా వేయించుకున్నారు. గురువారం జిల్లాలోని 22 కేంద్రాల్లో 1,058 మంది వైద్యారోగ్య, అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. 1279 మందికి వ్యాక్సిన్‌షన్‌ వేయాలని నిర్ణయించగా 221 మంది హాజరుకాలేదు. తుంగతుర్తి దవాఖానలో 180 మంది, కోదాడలో 156, చివ్వెంలలో 96మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి హర్షవర్ధన్‌ తెలిపారు. గురువారం జిల్లాలోని నూతనకల్‌, చివ్వెంల, మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయన పర్యటించి వ్యాక్సినేషన్‌ తీరును పరిశీలించారు. ఆయన వెంట వైద్యాధికారులు కళ్యాణ్‌ చక్రవర్తి, జయా శ్యాంసుందర్‌, సాహితి, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌రాజు, నాజియా, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo