ఇది దవాఖానంటే

నాడు శిథిల భవనాలు.. ఖాళీ కుర్చీలు నేడు రూ.18కోట్లతో బిల్డింగులు, అధునాతన వైద్య పరికరాలు అన్ని విభాగాలకూ డాక్టర్లు నవజాత శిశువుల కోసం ప్రత్యేక వార్డు ఈఎన్టీ ఆపరేషన్లు కోఠి తర్వాత ఇక్కడే.. ఏపీ జిల్లాల నుంచీ రోగుల రాక నాడు నాగార్జునసాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కమలా నెహ్రూ దవాఖాన పేరు తెలియనివారుండరు. డ్యాం నిర్మాణ సమయంలో అప్పటి ప్రజల అవసరాల కోసం దీన్ని నిర్మించారు. 100 పడకల ఈ ఏరియా వైద్యశాల ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. శిథిలావస్థకు చేరిన భవనాలు, డాక్టర్లు లేక ఖాళీగా కనిపించే కుర్చీలు వైద్యం కోసం ఇక్కడికొచ్చే పేదలను వెక్కిరించేవి. ఆపద అని వెళ్తే 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లగొండ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసేవాళ్లు. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండేది కాదు. కొన్నిసార్లు ఓపీ చూడడం తప్ప ప్రసవాలు కూడా చెయ్యని దుస్థితి.తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి వెంటిలేటర్ మీది పేషెంట్లా సమస్యల సుస్తీతో కొట్టుమిట్టాడిన కమలా నెహ్రూ దవాఖానకు కేసీఆర్ పాలనలో జవసత్వాలు అందాయి. రూ.18కోట్లతో నూతన భవనాలు, విశాలమైన వార్డులు, అధునాతన ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలు, ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఏ విభాగానికి వెళ్లినా స్పెషలిస్ట్ డాక్టర్ కనిపిస్తున్నారు. 14 మంది వైద్యులు, 18 మంది స్టాఫ్ నర్సులు, 100 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సర్జరీలు కూడా చేస్తున్నారు. నవజాత శిశువులు, కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. అత్యవసరమైతే అంబులెన్స్ రెడీగా ఉంది. గతంలో 150లోపు ఉన్న ఓపీ 350 దాటుతున్నది. సాగర్‌తోపాటు ఏపీ జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం ప్రజలు వస్తున్నారు.మాచర్ల నుంచి వచ్చా..మాది ఆంధ్రప్రదేశ్. సొంతూరు మాచర్ల. కమలానెహ్రూ ఆసత్ప్రిలో వైద్యం బాగుంటుందని వచ్చాను. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. డాక్టర్లు డెలివరీ చేసి పండంటి బాబును చేతిలో పెట్టారు.
- ఆధునిక వసతులతో కమలానెహ్రూ ప్రభుత్వ వైద్యశాల
- కార్పొరేట్ స్థాయిలో వైద్యం
- కమలా నెహ్రూ దవాఖానలో
- కిటకిటలాడుతున్న ప్రసూతి వార్డు
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ దవాఖానలకు మహర్దశ వచ్చింది.
- నాడు వసతులు, మందులు లేక ఇబ్బంది పడిన రోగులకు అధునాతన భవనాలతో
- వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం
- నందికొండలోని కమలా నెహ్రూ దవాఖాన కూడా విశేష సేవలందిస్తున్నది.
- కార్పొరేట్ దవాఖానకు దీటుగా నిర్మించిన భవనంలో అన్ని విభాగాలకు చెందిన
- డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండగా సర్జరీలు జరుగుతున్నాయి.
- గత పాలకుల నిర్లక్ష్యానికి శిథిలావస్థకు..
నాగార్జునసాగర్‌లో డ్యాం నిర్మాణ సమయంలో హిల్ కాలనీలో అప్పటి ప్రజల అవసరాల కోసం కమలా నెహ్రూ దవాఖానను నిర్మించారు. 100 పడకలతో చాలా సంవత్సరాల వరకు ప్రజలకు సేవలు అందించగా ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. దవాఖాన శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోవడం, వైద్యులు, వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
2019లో కొత్త భవనం ప్రారంభం
శిథిలావస్థకు చేరుకున్న దవాఖాన పక్కన కొత్తగా 100 పడకల దవాఖానను రూ.18 కోట్లతో నిర్మించి 5 ఆపరేషన్ థియేటర్లు, 6 అధునాతన ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2019లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య దవాఖానను ప్రారంభించారు. ఇటీవల రూ.24 లక్షలతో సీఆర్ ఎక్స్‌రే, మొబైల్ ఎక్స్‌రే, బ్లడ్ సెల్ కౌంటర్, సీఏఆర్‌ఎం యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. వీటితోపాటు ఐసీటీసీ, బ్లెడ్స్టోరేజ్ సెంటర్, అంబులెన్స్ కూడా ఉన్నాయి.
వైద్య సేవలు ఇలా..
ఈ దవాఖానలో 14 మంది డాక్టర్లు, 18 మంది స్టాఫ్ నర్సులు, ఇతర 100 మంది సిబ్బందితో రోగులకు నిత్యం వైద్యసేవలు అందుతున్నాయి. డాక్టర్లలో గైనాకాలజిస్ట్, ఈఎన్టీ, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, అనస్తీషియా, డెంటల్, సివిల్ సర్జన్, పీడీయాట్రిక్తోపాటు ఎంబీబీఎస్ పట్టా పొందిన వారు ఉన్నారు. రాష్టంలో ఎక్కడా లేని విధంగా ఈ దవాఖానలోనే ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు)కి సంబంధించిన ఆపరేషన్ల రోగుల ఇబ్బందులు తీర్చేందుకు చేపడుతున్నారు. గతంలో రోజుకు 150 మంది రోగులు దవాఖానకు రాగా ఇప్పుడు 350 మంది వరకు వస్తున్నారు. ప్రతి నిత్యం వివిధ విభాగాల్లో 70 నుంచి 80 మంది చికిత్స పొందుతున్నారు. అన్ని విభాగాలకు ఆపరేషన్ చేసే సౌకర్యం ఉండగా గర్భిణుల డెలివరీ ఆపరేషన్లు రోజుకు రెండు నుంచి మూడు వరకు జరుగుతుంటాయి. డెలివరీకి ఇక్కడ ప్రత్యేక వార్డులు, వైద్యులు అందుబాటులో ఉండడంతో పెద్దసంఖ్యలో మహిళలు ఇక్కడికే వస్తున్నారు.
నర్సింహయ్య కృషి..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ కూడా కానీ నాగార్జునసాగర్‌ను సీఎం కేసీఆర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కమలా నెహ్రూ ఏరియా దవాఖానను కొత్తగా
నిర్మించారు. పూర్తి స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించి, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. దీనిలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషి కూడా ఎంతో ఉంది. దీంతో నేడు రోగుల సంఖ్య పెరిగింది. ఇక్కడికి స్థానికులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి కూడా వైద్యం కోసం వస్తుండడం విశేషం.
పిల్లలు, కరోనా రోగులకు ప్రత్యేక విభాగం దవాఖానలో కరోనా
చికిత్సకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. నిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పరీక్షలు చేయగా, 4 వేల మందికి వైద్య సేవలు అందించారు. చిన్న పిల్లల వార్డును ఏర్పాటు చేసి పుట్టిన పిల్లలకు వెంటిలేటర్ వసతిని కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ డాక్టర్‌తోపాటు వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాం
దవాఖానలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయి. చికిత్స అందించేందుకు డాక్టర్లు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. దవాఖానలో డెలివరీ కేసుల సంఖ్య బాగా పెరిగింది. కేసీఆర్ కిట్ అందిస్తూ అన్ని వసతులు
కల్పిస్తున్నాం.
-అరవింద్, డాక్టర్
వెంటనే చికిత్స చేశారు..
నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చారు. డాక్టర్లు నాకు సకాలంలో వైద్యం అందించారు. గతంలో దవాఖానలో డాక్టర్లు అందుబాటులో ఉండేవారు కాదు. ఏదైనా అత్యవసర చికిత్సకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా దవాఖానకు వెళ్లాల్సి వచ్చేది.
- దేవయ్య, నాగార్జునసాగర్
పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు
నాకు ముక్కు ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రైవేట్ దవాఖానకు పోతే 30 వేలు ఖర్చు అవుతుందన్నారు. కమలా నెహ్రూ దవాఖానలో బాగా చూస్తున్నారని, ఆపరేషన్ మంచిగా చేస్తారని మా ఊరోళ్లు చెబితే ఇక్కడికి వచ్చిన. నాకు మంగళవారం ఆపరేషన్ చేశారు. మంచిగా చేశారు. ఎవరూ పైసలు అడుగలే..అన్నీ ఉచితంగా చేశారు.
ఎంతో మారింది..
మా అమ్మగారిది నాగార్జున సాగర్. మా అత్తగారి ఊరు కరీంనగర్. డెలివరీ టైం రావడంతో మా అమ్మవాళ్లు ఇక్కడ దవాఖాన బాగుంది. రమ్మంటే వచ్చాను. నాకు ఆపరేషన్ చేశారు. పాప పుట్టింది. డాక్టర్లు మంచిగా వైద్యం అందిస్తున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు దవాఖాన ఎంతో మారింది.
- ఇసార్, కరీంనగర్
ఓపీ సేవలు పెరిగాయి
నూతనంగా నిర్మించిన దవాఖానలో విశాలమైన వార్డులు, అధునాతన ఆపరేషన్ గదులు, ల్యాబ్‌లు ఉన్నాయి. దవాఖానలో అన్ని విభాగాల డాక్టర్లు ఉన్నారు. గతంలో ఓపీ రోజుకు 150 వరకు ఉండేది. ఇప్పుడు 350 వరకు పెరిగింది. కరోనా చికిత్సకు కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సర్కారు దవాఖానలు మారాయి.
- భానుప్రసాద్, దవాఖాన చీఫ్ సూపరింటెండెంట్
తాజావార్తలు
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!
- బండిస్తే జైలుకే..
- నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య
- దళిత వ్యతిరేకి బండి