లైన్ క్లియర్

- ఉమ్మడి జిల్లాలో
- నాలుగు రహదారులు
- వర్చువల్ పద్ధతిలో నేడు అధికారికంగా ప్రారంభం
నీలగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సోమవారం కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొననున్నారు. నకిరేకల్ -తానంచర్ల, నాగార్జునసాగర్-నకిరేకల్, సూర్యాపేట-ఖమ్మం, యాదాద్రి-వరంగల్ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే అనధికారికంగా ప్రారంభం కాగా ఇక ఊపందుకోనున్నాయి.
నీలగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు జాతీయ రహదారులకు సోమవారం కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెబ్‌నార్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 12గంటలకు ఈ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా ప్రారంభమై 12.45 గంటలకు ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14జాతీయ రహదారులకు శుంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి నాలుగు జాతీయ రహదారులతోపాటు ఆగిపోయిన రహదారులకు సైతం నిధులు ఇవ్వనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి నుంచి వరంగల్ హైవే వరకు సుమారు 99కిలోమీటర్లకు ఎన్‌హెచ్‌డీపీ ఫేజ్-4 నుంచి రూ.1890 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 58కిలోమీటర్లు నాలుగు లైన్లతో నిర్మాణం చేపట్టనున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా వెళ్లనున్న నకిరేకల్ నుంచి తానంచర్లకు 66.92 కిలోమీటర్లకు రూ.605 కోట్లతో పనులు చేపట్టనున్నారు. నాగార్జునసాగర్ నుంచి నకిరేకల్ వరకు చేపట్టిన 565జాతీయ రహదారి 85.45కిలోమీటర్లకు రూ369.91 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు గతంలో చేపట్టినప్పటికీ టెండర్లో వేసిన కొటేషన్‌కు చాలా వ్యత్యాసం ఉండడంతో సదరు కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపివేయడంతో రీ టెండర్ పిలిచి పనులను ప్రారంభిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారుల పనులు ఇక వేగవంతం కానున్నాయి.
తాజావార్తలు
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్‌మా మిస్?!