సోమవారం 06 జూలై 2020
Nalgonda - Jun 30, 2020 , 02:48:47

రేపే ‘టీఎస్‌ పాలీసెట్‌'

రేపే ‘టీఎస్‌ పాలీసెట్‌'

  • ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30గంట వరకు పరీక్ష
  • నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్‌
  • ప్రవేశానికి మాస్కు తప్పనిసరి

నల్లగొండ విద్యావిభాగం/సూర్యాపేటఅర్బన్‌ : పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్‌ పాలీసెట్‌'-2020 పరీక్ష జూలై 1న(బుధవారం)జరుగనుంది. పరీక్షకు నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2,783 మంది విద్యార్థులు హాజరవుతుండగా, సూర్యాపేట జిల్లాలో 1870 మంది హాజరుకానున్నారు. వీరి కోసం నల్లగొండలో 10, సూర్యాపేటలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్ల్లు ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లు వెల్లడించారు.

సూర్యాపేటలో పరీక్ష కేంద్రాలు..  

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో-300మంది, గౌతమి డిగ్రీ కళాశాలలో-312, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో-794, డిగ్రీ కళాశాలలో-300, ఆర్‌కేఎల్‌కే డిగ్రీ కళాశాలలో -44, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ మహిళా కళాశాలలో-120మంది పరీక్ష రాయనున్నారు.

పాటించాల్సిన నియమాలు..

  1. పరీక్ష ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు జరుగనుంది. 
  2. విద్యార్థులు ఉదయం 9:30 లోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 10గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా  అనుమతించరు.


logo