బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 07, 2020 , 00:54:23

చిట్యాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

చిట్యాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు (వెంకటాపురం)లో ఆయన స్థానిక ప్రతినిధులతో కలిసి వైకుంఠధామం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, వీధుల వెంట పెరిగిన పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయించి మాట్లాడారు. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి, వీధి దీపాలను అమర్చుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వార్డువాసులు ఆయనకు వినతిప్రతం అందజేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు పందిరి గీత, బెల్లి సత్తయ్య, జిట్ట పద్మ, సిలివేరు మౌనిక, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ మెండె సైదులు, నాయకులు గుండెబోయిన సైదులు, పందిరి రమేశ్‌, దాసరి నర్సింహ, జిట్ట బొందయ్య, వార్డువాసులు తదితరులు పాల్గొన్నారు. 


logo