సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 20, 2020 , 02:34:04

వేమహా జాతరకు వేళాయే..

వేమహా జాతరకు వేళాయే..

మూసీ ఒడ్డున సోమేశ్వరుడు..

నేరేడుచర్ల : మండలంలోని బూర్గులతండా గ్రామపంచాయతీ పరిధిలో మూసీనది ఒడ్డున సోమప్ప సోమేశ్వర ఆలయం అతి పురాతన చరిత్ర కల్గినది. మహిమానిత్వం కలిగిన స్వామి వారిని భృగుమౌలికా సోమేశ్వరుడు అని పిలుస్తారు. 20న సుప్రభాతం, గణపతిపూజ, పుణ్యావాహచనం, పంచగవ్యప్రాసన, దీక్షాదారణ, నానాద్రవ్యక, సహితమహాన్నత, సహితకుంభాభిషేకం, అగ్నికరణం, ఫూర్ణాహుతి నిర్వహించనున్నారు. 21న సుప్రభాతం, మహన్యాస పూర్వక ప్రత్యేక ఏకాదశి రుద్రభిషేకం, ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, అనంతరం కోలాటప్రదర్శన, రాత్రి 8.30కు స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం, బుర్రకథలు నిర్వహిస్తారు.


నల్లగొండ, నమస్తే తెలంగాణ: గ్రామాలను అన్ని రంగా ల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15వ ఆర్థ్ధిక సంఘం కింద జిల్లాకు యేటా రూ. 20కోట్లు విడుదల చేస్తున్నది. 5నెలలుగా ఈ నిధుల విడుదల జరుగుతుండగా వీటితో ఇప్పటికే గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. పారిశుధ్యం నిర్వహణ, వీధి లైట్లు, ఇతర అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు అవసరమున్న నేపథ్యంలో పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని సర్కార్‌ సూచించింది. జిల్లా వ్యాప్తంగా 844 పంచాయతీల్లో ఈ ఆర్థ్ధిక సంవత్సరం రూ. 22కోట్లు పన్ను రూపేనా రావాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే రూ.11 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన మొత్తాన్ని సైతం వసూలు చేసి పంచాయతీల అభివృద్ధి వినియోగించాలని ప్రభుత్వం సూచించడంతో పంచాయతీ కార్యదర్శులు ఆయా పంచాయతీల పాలకవర్గం సహకారంతో మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు


జిల్లా వ్యాప్తంగా 22 కోట్ల పన్నులు...

జిల్లావ్యాప్తంగా 844పంచాయతీలుండగా ఆయా పంచాయతీల్లో 3లక్షల 41వేల ఇండ్లు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి పన్ను వసూలు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సైతం పన్నులను వసూలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ట్యాక్స్‌ విభాగంలో ఇంటి పన్నులతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలకు ఇచ్చే ట్రేడ్‌ లైసెన్స్‌దారుల నుంచి పన్నులు వసూలు చేయనున్నారు. ఇక నాన్‌టాక్స్‌ కింద సంతలు, పంచాయతీ పరిధిలోని చెరువులు, ఇతర వేలాలతో వచ్చే పన్నులు సైతం వసూలు చేస్తారు. రూ.22కోట్లలో 15కోట్లు ఇంటి పన్నుల రూపంలో రాగా, రూ.మూడు కోట్లు ట్రేడ్‌ లైసెన్స్‌దారుల నుంచి మరో రూ.4 కోట్లు నాన్‌ట్యాక్స్‌ దారుల నుంచి వసూలు చేయనున్నారు. అయితే ఈసారి వీటిల్లో ఇప్పటికే రూ.11కోట్లు వసూలు కాగా ఈ నెల చివరి నాటికి 70శాతం పన్నుల వసూలు లక్ష్యంగా పెట్టుకున్న పంచాయతీరాజ్‌ శాఖ యంత్రాంగం వచ్చే నెల నాటికి పూర్తిస్థాయిలో చేసేలా ప్రణాళికలు రూపొందించింది. 


పాలక వర్గం సహకారంతో స్పెషల్‌ డ్రైవ్‌....

గ్రామ పంచాయతీల్లో వసూలైన పన్నులు ఆ పంచాయతీ అభివృద్ధి కోసమే వినియోగించవచ్చు. పన్నులు పూర్తిస్థాయిలో వసూలైతే ఆయా పంచాయతీల అభివృద్ధ్ది నిరాటంకంగా కొనసాగుతుంది. పన్ను వసూళ్ల ఆవశ్యకతపై ప్రభు త్వం స్థానిక పాలక వర్గానికి పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అవగాహన కల్పించింది. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయాలని సూచించింది. పన్ను వసూళ్ల బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అయినా మండ ల అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌, వార్డుసభ్యుల సహకారం తో వచ్చే నెల నాటికి 100శాతం పన్నులు వసూళ్లు చేసేలా దృష్టి సారించారు. logo