యాదగిరిగుట్ట, మే 10 : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో మండలంలోని కాచారం గ్రామానికి చెందిన బీబీనగరం లక్ష్మణ్, రాములు నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు బీబీనగరం జ్యోత్స్న, భరత్, బర్మ మనోహర్, భాను, సుంచు దివాకర్, దుంపం లోకేశ్, గ్యార పరశురాములు, మల్లేశ్, సుంచు శ్రీకాంత్, బీబీనగరం కృష్ణ, ఫిరోజ్‌ఖాన్, మాజీ వార్డు సభ్యురాలు ఎల్లమ్మతోపాటు 200 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు వారు పట్టణంలో శ్రీవారి పాదాల వద్ద నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ వచ్చి గొంగిడి నిలయంలో ఆయన సంమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి డీసీసీబీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ 9 ఏండ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. పుట్టిన పాప నుంచి వృద్ధురాలి వరకు సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారని చెప్పారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని, వాటిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశ ప్రజలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం కేసీఆర్‌కు అండగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, కాచారం సర్పంచ్ కుండం అరుణాఅశోక్రెడ్డి, రైతుబంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, మాజీ సర్పంచ్ నరహరి, ఉప సర్పంచ్ పుట్ట శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, సలీం, బాల్‌రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.