నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 26 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో డిగ్రీ పరీక్షల్లో సోమవారం జరిగిన ఆరో సెమిస్టర్ లో 13 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడగా డీబార్ చేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు 5,090 మంది హాజరు కావాల్సి ఉండగా 4,708 మంది హాజరయ్యారు. 369 మంది గైర్హాజరయ్యారు. కాగా భువనగిరిలోని స్టాండ్ఫర్డ్ ఉమెన్స్ కళాశాలలో నలుగురు, తిరుమలగిరి ప్రగతి డిగ్రీ కళాశాలలో ఒకరు, దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, భవిత డిగ్రీ కళాశాలలో ఒకరు, సూర్యాపేట ఆర్కేఎల్కే డిగ్రీ కళాశాలలో ఒకరు, రాకేశ్ బీఈడీ కళాశాలలో ముగ్గురు, మిర్యాలగూడ హస్త ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒకరు, కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో ఒకరు డీబార్ అయ్యారు.