కొండమల్లేపల్లి, డిసెంబర్ 6 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండలం బుడ్డోనితండాకు చెందిన 120 కుటుంబాలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కు అందిస్తున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతుబీమా పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని గుర్తుచేశారు. నిబద్ధతతో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమావత్ దస్రూనాయక్, పస్నూరి యుగేంధర్‌రెడ్డి, నాయకులు మేకల శ్రీనివాస్‌యాదవ్, రమావత్ లాలూనాయక్, రమావత్ తులసీరాం, ముడావత్ పాండు, వాంకునావత్ బిక్కు, రావుల వెంకటయ్య, సత్యనారాయణ, వెంకటేశ్‌నాయక్, బాలూనాయక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.