Karepalli | గ్యాస్ బండపై అదనపు వసూళ్లు.. వాహనాన్ని అడ్డుకున్న వెంకిట్యాతండా గ్రామస్థులు
కారేపల్లి : సిలిండర్పై గ్యాస్ ఏజన్సీలు అక్రమంగా అదనపు వసూళ్లకు పాల్పడుతుండటంపై కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు.
కారేపల్లి : గ్యాస్ ధరలు పెరిగి అవస్ధలు పడుతున్న వినియోగదారులపై గ్యాస్ ఏజన్సీలు మరింత భారం మోపుతున్నాయి. సిలిండర్పై గ్యాస్ ఏజన్సీలు అక్రమంగా అదనపు వసూళ్లకు పాల్పడుతుండటంపై కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు. సదరు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వాహనాన్ని సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.
వెంకిట్యాతండా గ్రామస్థులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్ లైన్లో గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.965, దానికి డెలివరీ చార్జీలు రూ.20 మొత్తం రూ. 985లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ కావాలి. కానీ, కారేపల్లి మండలంలో వాహనాలలో గ్యాస్ డెలివరీ చేస్తున్న వ్యక్తులు మాత్రం రూ. 1100 డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు.
గ్యాస్ బుకింగ్ చేయని వారి నుండి అదనంగా మరో రూ.100 తీసుకుంటూ దోచుకుంటున్నారని వారు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్యాస్ బండను అధిక ధరకు అమ్మడాన్ని నిరసిస్తూ గ్యాస్ బండలతో వచ్చిన వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్యాస్ ఏజన్సీ సిబ్బంది అధిక ధరలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని తహసీల్దార్, ఆర్ఐ, జీపీవోల దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్థులు. దాంతో, అధికారులు సదరు గ్యాస్ వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- gas
- gas agency
- GPO
- Karepalli
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

