Assam Rifles soldiers killed | మణిపూర్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి.. ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మృతి
Assam Rifles soldiers killed | జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Assam Rifles soldiers killed) సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో 40 అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. వెంటనే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. దాడి చేసిన అనుమానిత మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, ఉఖ్రుల్ జిల్లాలోని లంబూయి గ్రామంలో మోహరించిన సుమారు 40 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బంది న్యూ హెవెన్‌లో ఒక అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపకుండా అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆదివారం మహిళలు, విద్యార్థి సంఘాలతో సహా స్థానికులు నిరసన తెలిపారు. అవుట్‌పోస్ట్ నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నిరసన చేస్తున్న జన సమూహాన్ని నియంత్రించేందుకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది లాఠీచార్జ్‌తో పాటు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత మిలిమెంట్లు మెరుపుదాడి చేయడంతో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

