సూర్యాపేట టౌన్, మార్చి 10 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి అర్చకుల ఆశీర్వాదాలు అందుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు రంగినేని ఉపేందర్ రావు ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు నాగవెల్లి ప్రభాకర్, కీసర అంజన్‌రెడ్డి, వనమా సుభాష్, అధ్యక్షులు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవల్లి దశరథతో పాటు ఆలయ అర్చకులు మరిగంటి వరదాచార్యులు, రఘువరచార్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.