జానకిపురం ఘటనకు 11 ఏండ్లు.. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో పోలీసుల వీరమరణం
జానకిపురం సిమీ ఉగ్ర ఘటనకు శనివారంతో 11 ఏండ్లు నిండాయి. ఆ విషాద ఘటన ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. 2015 ఏప్రిల్ 4న అప్పటి మోతూర్, ఇప్పటి అడ్డగూడూరు మండలంలోని జానకిపురంలో సిమీ ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో అప్పటి ఆత్మకూరు(ఎం) ఎస్ఐ డి.సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృత్యువ్యాత పడ్డారు.
ఆత్మకూరు( ఎం), ఏప్రిల్ 3 : జానకిపురం సిమీ ఉగ్ర ఘటనకు శనివారంతో 11 ఏండ్లు నిండాయి. ఆ విషాద ఘటన ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. 2015 ఏప్రిల్ 4న అప్పటి మోతూర్, ఇప్పటి అడ్డగూడూరు మండలంలోని జానకిపురంలో సిమీ ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో అప్పటి ఆత్మకూరు(ఎం) ఎస్ఐ డి.సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృత్యువ్యాత పడ్డారు. నాడు అడ్డగూడూరు మండలం జానకిపురంలో దోపిడీ దొంగలు సంచరిస్తున్నారనే సమాచారంతో వారిని పట్టుకునేందుకు సిద్దయ్యతో పాటు పోలీసులు నాగరాజు, శివ, మధు, శ్రీను, హరిబాబు, నగేశ్ పోలీసు వాహనంలో వెళ్లారు.
దోపిడీ దొంగల ముసుగులో ఉన్న సిమీ ఉగ్రవాదులను పట్టుకునే సమయంలో దుండగులు పోలీసు వాహనంపై కాల్పులు జరిపారు. దుండగులు కానిస్టేబుల్ నాగరాజుపై కాల్పులు జరపడంతో అతడు అకడికకడే మృతి చెందారు. మిగతా పోలీసులు ప్రాణాలతో బయటపడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్ఐ సిద్దయ్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సిద్దయ్య సాధారణ కుటుంబంలో జన్మించి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రసూల్పురానికి చెందిన కానిస్టేబుల్ నాగరాజు వివాహమైన ఆరు నెలలకే ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందడం బాధాకరం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

