
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, జూలై 1 : పట్టణాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రధానలక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ విష్ణు, కమిషనర్ వెంకన్న, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని కొత్తగూడెం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రారంభించి మొక్కలు నాటారు. గ్రామ సభలో పాల్గొన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ రోహిత్ సింగ్, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి, ఎంపీడీఓ అజ్మీర దేవిక , తాసీల్దార్ గణేశ్, మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మద్దెలశ్రీలతావిక్టర్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో సమస్యల పరిష్కారం : ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండరూరల్, జూలై 1 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, ఆర్డీఓ గోపీరాం, ఎంపీడీఓ ఆర్కే శర్మ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, సర్పంచ్ మునికుంట్ల విద్యావతీవెంకట్రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, ఎంపీటీసీ వెంకటమ్మ పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే భగత్
హాలియా : గ్రామాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని పాలెం, చింతగూడెం, రామడుగు, యాచారం, ముక్కమాల, అన్నారం గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. చింతగూడెం దళిత కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తపల్లి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌హెచ్‌జీ స్టోర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతీపురుషోత్తం, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ సలహాదారుడు యడవల్లి మహేందర్‌రెడ్డి, ఎడమ కాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి మాధవి, తాసీల్దార్ లావూరి మంగ, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, ఏఓ సంతోషిని, ఎంపీఓ భిక్షంరాజు, ఏపీఎం కళావతి ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులో పట్టణ ప్రగతి సభలు నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
దేవరకొండ : పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ అన్నారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, వార్డు సభ్యులు పొన్నబోయిన భూదేవీసైదులు, మల్లేశ్వరీఅశోక్, నేనావత్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, గాజుల మురళి, చిత్రం శ్రీవాణి, వార్డు ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
చందంపేట : మండలంలోని చందంపేట, ముడుదండ్ల, పోల్యానాయక్ తండా గ్రామాల్లో డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ పవిత్ర, ఎంపీడీఓ రాములునాయక్, తాసీల్దార్ ముఖ్తార్, సర్పంచులు గోసుల కవిత, లోకసాని అనురాధ, రాంలీ, మల్లారెడ్డి, శంకర్ రావు, పార్వతి, సుశీల శంకర్‌నాయక్, కొండల్ రెడ్డి, నాగార్జున, అలివేలు, రాములమ్మ, జంగమ్మ, మహేశ్, ఎంపీటీసీ మల్లయ్య పాల్గొన్నారు.
నేరేడుగొమ్ము ప్రత్యేకాధికారి శ్రీకాంత్, నేరేడుగొమ్ము, పందిరిగుండు తండా గ్రామాలను సందర్శించారు. కొత్తపల్లిలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఎంపీపీ బాణావత్ పద్మ చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మి, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సర్పంచ్ బాలమణి, ఎంపీఓ శ్రీనివాస్ ఉన్నారు.
డిండి : మండలంలోని కామేపల్లి గ్రామంలో ఎంపీపీ మాధవరం సునీతాజనార్ధన్రావు, ఎంపిడీఓ గిరిబాబుతో కలిసి పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.