
చిట్యాల, అక్టోబర్ 12 : ఆడబిడ్డలకు పుట్టింటి సారెలా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, తాళ్లవెల్లంల, ఉరుమడ్ల గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం తాళ్లవెల్లంలలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఏపూరు ప్రాథమిక పాఠశాలలో దివీస్ కంపెనీ వారు రూ.15 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు పాలెం మాధవీమల్లేశం, జనగాం రవీందర్, కంచర్ల శ్రీనివాసరెడ్డి, వడ్డేపల్లి లక్ష్మయ్య, సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, టీ ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే
నల్లగొండ రూరల్ :ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జీకే అన్నారం, అన్నారెడ్డిగూడెం, ముషంపల్లి, తొరగల్, మేళ్లదుప్పలపల్లి, జీ.చెన్నారం, కొత్తపల్లి, గుండ్లపల్లి, నర్సింగ్‌భట్ల, దోమలపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. గ్రామాల్లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు చేశారు. జీ.చెన్నారంలో అన్నదానం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుమన్, జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి ఆర్ఐ అమర్నాథ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, సర్పంచులు పందిరి సరిత, సరస్వతి, బైరెడ్డి వెంకట్‌రెడ్డి ,ఎడ్ల అండాలు, పద్మావతి, ఉప్పునూతల వెంకన్న, రొమ్ముల నాగయ్య, పంతంగి సరిత, చామకూరి తేజస్విని, బడుపుల శంకర్, రాజుపేట మల్లేశ్, బీరం గోపాల్‌రెడ్డి, చింత సైదులు, నారగోని నరసింహ, ధనలక్ష్మి, తవిటి కృష్ణ ,విజయ్ పాల్గొన్నారు.
నీలగిరి : పట్టణంలోని 17వ వార్డు పరిధిలోని ఆర్జాలబావిలో మన్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సహకారంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలోఅంగన్వాడీ టీచర్లు ఖుర్షీదాబేగం, సుగుణ, ఆర్పీలు విజయలక్ష్మి, సమత. అన్వర్ ఉన్నారు.
నార్కట్‌పల్లిలో..
నార్కట్‌పల్లి : మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో సర్పంచ్ యానాల మాధవీ అశోక్‌రెడ్డి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆండాలు, నర్సింహ పాల్గొన్నారు.