సూర్యాపేట, సెప్టెంబర్ 9 : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థా యి పర్యటనలు చేసి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ప్రజావాణి నిర్వహించారు.
ప్రజల నుంచి 84 దరఖాస్తులను స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయని, అధికారులు ప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమా దం తప్పిందన్నారు. వరదల వల్ల తెగిపోయిన కాల్వ, చెరువు కట్టలు, దెబ్బతిన్న రోడ్లు, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లలకు మరమ్మతులు చేయాలని తెలిపారు.
మునిగిపోయిన పంట పొలాలు, చనిపోయిన పశువులు, కూలిన ఇండ్ల వివరాలతో నివేదికలు తయారు చేసి అం దించాలని చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభు త్వం నష్ట పరిహారం అందిస్తుందని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు కేటాయించిన ప్రత్యేక అధికారులు వాటిని సందర్శిం చి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుం డా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీ య స్థాయిలో అందించే 9 రకాల పంచాయతీ రాజ్ అవార్డులకు 9 గ్రామ పంచాయతీలు దరఖాస్తులు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జడ్పీసీఈఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.