నిడమనూరు, జూన్ 3 : పల్లెల సమగ్రాభివృద్ధే పల్లె ప్రగతి కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవాం నిర్వ హించిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో పల్లెల ముఖచిత్రాలు మారాయన్నారు. పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జానయ్య, ఎంపీఓ రామలింగయ్య, సర్పంచులు శంకర్, రమేశ్, మాజీ సర్పంచ్ అంజ య్యయాదవ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, రామచంద్రయ్య, మర్ల చంద్రారెడ్డి, వెంకటాచారి, వంగాల వెంకన్న, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : పల్లె ప్రగతి ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మూరుమూల గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దగట్టు, ఘనపురం గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. ప్రజలను భాగస్వాములను చేసి పల్లె ప్రగ తిని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ మోహాన్‌రెడ్డి, ప్రత్యేకాధికారి జగన్నాథరావు, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, సర్పంచులు నరేందర్ నాయక్, పావనీపరమేశ్, ఎంపీటీసీలు నారాయణ, సంధ్య పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : ప్రజలను భాగస్వాములను చేసి ఐదో విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇందుగుల, మాడ్గులపల్లిలో ‘మన ఊరు మనబడి, పల్లె ప్రగతి, తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానం, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామల్లో నేడు అద్భుతమైన మార్పు సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డీఈఓ బిక్షపతి, ఏపీడీ సత్యనారాయణ, ఎంపీపీ పోకల శ్రీవిద్య, తాసీల్దార్ అర్చన, ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి, సర్పంచులు కన్నయ్య, శోభ, నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుబ్బారెడ్డిగూడెంలో పల్లె ప్రగతిని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పారిశు ధ్యం, తాగునీరు, డ్రైనేజీల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేసుకొని ఆదర్శ గ్రామాలుగా నిలపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, సర్పంచ్ జయమ్మాకోటిరెడ్డి, ఎంపీటీసీ వీరవేణి, వీరారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా చింతపల్లి సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పనులను గుర్తించారు. కార్యక్రమంలో కార్యదర్శి మాధవరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చందంపేట : మండలలోని యల్మలమంద, గన్నెర్లపల్లి, కోరుట్ల, చందంపేట, యాపలపాయతండాల్లో శుక్రవారం 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాములునాయక్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు కవిత, గిరి, నెహ్రూనాయక్, సుశీల, శంకర్‌నాయక్, మల్లారెడ్డి, అనురాధ, శంకర్రావు, నాగార్జున, కార్యదర్శులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండ లంలోని చింతకుంట్ల గ్రామంలో శుక్రవారం పల్లె ప్రగతి గ్రామసభ జరిగింది. సర్పంచ్ రుద్రమ్మాశ్రీను మాట్లాడుతూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూ చించారు. సమావేశంలో కార్యదర్శి కిరణ్, పర్యవేక్షణ ప్రత్యేకాధికారి శ్రీను పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : 15 రోజుల పాటు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమాన్ని మొదటి రోజు మండలంలోని కొండభీమనపల్లి,మర్రిచెట్టుతండా గ్రామాల్లో నిర్వహించారు. గ్రామ సభల్లో పలు అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర చేసి డ్రైనేజీలు, రోడ్లపై చెత్త, కరెంటు సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిందిగా తీర్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు మునికుంట్ల విద్యావతీవెంకట్రెడ్డి, నేనావత్ శ్రీనూనాయక్, కార్యదర్శులు నిరంజన్, సిరిచందన, నోడల్‌అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో ఖాజా అస్గర్ అలీ తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవగాహన కల్పించి ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమలగిరి సర్పంచ్ శాగం శ్రవణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బిచ్యానాయక్, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.