
త్రిపురారం/ నిడమనూరు, అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి, నిడమనూరు మండలం గుంటిపల్లి, బాలాపురం, గ్రామాలకు చెందిన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అనంతరం త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి తండ్రి అనుముల పెదకోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, వనజ, యూత్ అధ్యక్షుడు ధనావత్ రవి, ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, నాయకులు పెద్దబోయిన శ్రీనివాస్, మాతంగి నాగరాజు, జంగిలి శ్రీనివాస్, అవిరెండ్ల సైదులు నిడమనూరులో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, పార్టీ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, సర్పంచ్ సంధ్యారాణి, ఉప సర్పంచ్ యాదగిరి, గ్రామాధ్యక్షుడు విజేందర్, నాయకులు మధుబాబు, మెరుగు రామలింగయ్య, కళావతి, సర్పంచులు రాంబాబు, మమతాకోటిరెడ్డి పాల్గొన్నారు.
ఉద్యమకారుడి కుటుంబానికి పరామర్శ
హాలియా : అనుముల మండలం హజారిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు ఎర్రబోయిన నాగేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరామర్శించారు. నాగేందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, మండల అధికార ప్రతినిధి చేగొండి కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు వహీద్, సీనియర్ నాయకుడు బాబూరావునాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంటిగొర్ల పాపయ్య, ఉప సర్పంచ్ జలీల్, సుండ్ర భాస్కర్‌రావు, సురభి రాంబాబు, ఎంపీటీసీ వెంకటయ్య పాల్గొన్నారు.
కార్మికుడి కుటుంబానికి ..
నందికొండ :మున్సిపాలిటీలో ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు రాజీవ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నోముల భగత్ పరామర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, కమిషనర్ రవీందర్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ లల్పతి పాల్గొన్నారు.
నర్సింహారెడ్డి విగ్రహావిష్కరణ
త్రిపురారం : మండల కేంద్రంలోని అనుముల సుశీలా నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో అనుముల నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యేలు జానారెడ్డి, జూలకంటి రంగారెడ్డి పాల్గొని నర్సింహారెడ్డి, సుశీల దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్రిపురారం మండలాభివృద్ధిలో నర్సింహారెడ్డి పాత్ర కీలకమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్యే భగత్ జానారెడ్డి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలుకరించి కరచాలనం చేశారు. అనుముల మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, జడ్పీటీసీ భారతీ భాస్కర్‌నాయక్, ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్యయాదవ్, నాయకులు మార్తి భరత్‌రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
తిరుమలగిరి (సాగర్) : మండలంలోని నాగార్జునపేటతండాలో ఏర్పాటు చేసిన కొత్త ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, యువజన అధ్యక్షుడు జటావత్ రమేశ్, సర్పంచ్ రమావత్ కనికి, ఎంపీటీసీ పెదమాం కాశయ్య, మార్కెట్ వైస్‌చైర్మన్ గుండాల రవి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను, ఉపసర్పంచ్ జ్యోతి, నాయకులు రమావత్ రవి పాల్గొన్నారు.