శనివారం 05 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 31, 2020 , 06:49:44

రేపు 5వ తరగతి ప్రవేశ పరీక్ష

రేపు 5వ తరగతి ప్రవేశ పరీక్ష

కల్వకుర్తి: సాంఘిక సంక్షేమ, ట్రైబల్‌, గురుకుల, జ్యోతిరావు ఫూలే పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతిలో ప్రవేశానికి నవంబర్‌ 1న (ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు  సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారి దానం తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తుండగా 6,118 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఇప్పటి వరకు హాల్‌టికెట్‌ పొందని వారు https://tgcet.egg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.