శనివారం 30 మే 2020
Nagarkurnool - May 07, 2020 , 02:22:22

నర్సన్న గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

నర్సన్న గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

  • అప్పాజిపల్లిలో లక్ష్మీనృసింహుని జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి 

తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలోని నర్సన్న గుట్టపై వెలసిన లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఆలయంలో బుధవారం నరసింహుని జయంతి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండపం నిర్మాణం కోసం కోడుపర్తికి చెందిన సోదరులు రాజేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి రూ.5లక్షల చెక్కును విరాళంగా ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ డైరక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌ తిరుపతమ్మ, ఆలయ కమిటీ సభ్యులు రాందేవ్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌, సుందయ్య పాల్గొన్నారు.logo