ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Mar 08, 2020 , 01:25:31

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

 నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లా కేంద్రంలోని సీఎన్‌ఆర్‌, శారద హైస్కూల్‌ పాఠశాలలో శనివారం విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవ వేడుకలను  నిర్వహించారు. సీఎన్‌ఆర్‌ విద్యార్థులు డీఈవో మైత్రి, ఎంఈవోగా గ్రీష్మ, ప్రధానోపాధ్యాయురాలిగా దివ్య, కరస్పాండెంట్‌గా పల్లవిలతోపాటు పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ప్రతిభ కనబరిచిన షానాజ్‌ పర్వీన్‌, శ్రీనిధి, దీపర్‌రెడ్డిలకు   బహుమతులను ప్రదానం చేశారు.   కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు చంద్రకళ, భాస్కర్‌రావు, హెచ్‌ఎం కవిత, కరస్పాండెంట్‌ నర్సింహమూర్తి, యాజమాన్యం వెంకటేశ్వర్‌రావు, ఫసియోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

శారద హైస్కూల్‌లో..

పట్టణంలోని శారద హైస్కూల్‌  స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గణేష్‌గౌడ్‌, భార్గవి, దీక్షితలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంవెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌శర్మ, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

 ఆవంచ,మారేపల్లిలో..

తిమ్మాజిపేట : తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలోని జీపీఎస్‌ పాఠశాల, మారేపల్లి , గొరిట ప్రాథమిక పాఠశాలల్లో    స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన ఆవంచ సర్పంచ్‌ ఆజయ్‌ విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠాలు చక్కగా బోధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.


logo