ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 26, 2020 , 01:20:24

ఉపయోగపడేలా కొత్త చట్టం

ఉపయోగపడేలా కొత్త చట్టం

కల్వకుర్తి రూరల్‌ : ప్రజలందరికీ ఉపయోగపడేలా నూతన మున్సిపల్‌ చట్టం రూపొందించడం జరిగిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పట్టణ ప్రగతిపై మంత్రి ప్రసంగం అనంతరం పలువురికి మాట్లాడేందుకు అవకాశం కల్పించగా తమ సమస్యలను వివరించారు. వారికి మంత్రి సమాధానమిచ్చారు.

అధ్యాపకుడు బాలకృష్ణ : కల్వకుర్తి మున్సిపాలిటీ చా లా దూరంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వార్డులో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

మంత్రి కేటీఆర్‌ : మున్సిపాలిటీలో కౌన్సిలర్లే వార్డుకు కేసీఆర్‌. ప్రజలు నిత్యం తమ సమస్యలను కౌన్సిలర్లకు చెప్పుకునేలా ప్రతి వార్డులో కేంద్రాలను ఏర్పాటుచేయాలని చైర్మన్‌, కౌన్సిలర్లకు సూచించారు.

బాలకృష్ణ : మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉన్నారు. సిబ్బందిని నియమించాలి.. అలాగే విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తాం.

మంత్రి కేటీఆర్‌ : మున్సిపాలిటీ సిబ్బంది కొరతను వీ లైనంత త్వరలో తీర్చుతాం. విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తామని చెప్పడం అభినందనీయమని అన్నారు. 

రాంబాయి : 22వ వార్డులో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. 

మంత్రి కేటీఆర్‌ : వెంటనే కాలనీలో పర్యటించి స్తంభాలకు ఎ ల్‌ఈడీ లైట్లు బిగించాలని అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మ న్‌, కౌన్సిలర్లను ఆదేశించారు.

రిటైర్డ్‌ టీచర్‌, లక్ష్మణ శర్మ : కల్వకుర్తి బస్టాండ్‌ సమీపంలోని లైబ్రరీవద్ద వైన్స్‌ షాప్‌ ఇబ్బందికరంగా ఉంది. తమ ఇళ్లకు చెల్లించాల్సిన పన్ను అధికంగా ఉన్నది.

మంత్రి కేటీఆర్‌ : వైన్స్‌ షాప్‌ విషయంపై మున్సిపల్‌ చైర్మన్‌ను అడగగా, సదరు దుకాణదారుడికి నోటీసులు అందించినట్లు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఇంటిపన్నును సరిచేయాలని అధికారులకు సూచించారు. 

సమస్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణాభివృద్ధిలో తామూ భాగస్వాములం అవుతామన్నారు. 


logo